మోడల్ స్కూల్ ఇంటర్ ఫలితాలు
ఏపి మోడల్ స్కూల్ లో ఇంటర్ ఫలితాలు
📖
వెంకటగిరి, ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరంలో 70, ద్వితీయ సంవత్సరంలో 82 శాతం ఫలితాలను సాధించారు.
ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపిసిలో ఎ. సురేఖ 470 మార్కులకు 423 మార్కులు, కె. నితీష్ రెడ్డి 417 మార్కులు సాధించారు. షేక్ అఫియా నూజహత్ 411 మార్కులు సాధించారు.
గత ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపిసిలో కె. మునికుమార్ 470 మార్కులకు 463 మార్కులు సాధించగా ఇప్పుడు మళ్ళీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించారు.
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ డి. తులసి జ్యోతి, ఉపాధ్యాయులు అభినందించారు.
