Admissions

వెంకటగిరి మోడల్ స్కూల్ గురించి

ఎపి మోడల్ స్కూల్ జూనియర్ కాలేజ్ – వెంకటగిరి.

45a

నాణ్యమైన విద్య…
ఉన్నత లక్ష్యాలు…
నైతిక విలువలు…
మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు సరైన దిశ – దశ చూపే
ఆదర్శవంతమైన విద్యాసంస్థ…
అదే
AP Model School Junior College Venkatagiri.

“ఇక్కడ ప్రతి విద్యార్థిలో నైపుణ్యత.. ఒక ప్రత్యేకత…
ఆదర్శ పాఠశాల ఈ ప్రతిభకు ప్రతి రూపం, ప్రగతికి నిదర్శనం…

ఆరో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు
క్రమ శిక్షణ.. నాణ్యత.. నైపుణ్యం నైతిక విలువలతో విద్యనందించడమే మా లక్ష్యం..

విశాల భవనం.. ఆధునిక విద్యకై సకల సౌకర్యాలు, డిజిటల్ క్లాస్ రూములు, IFP పానల్స్ ద్వారా అనుభవజనులైన పీజీటీ, టీజీటీ ఆధ్యాపకులతో.. ఆంగ్ల మాధ్యమంలోనే విద్యా బోధన.

ఆధునిక డిజిటల్ క్లాస్‌రూమ్‌ల ద్వారా
పాఠ్యాంశాలు సులభంగా, స్పష్టంగా ప్రతి విద్యార్థికి అర్ధం అయ్యేలా విద్య అందించబడుతుంది.

ప్రతి విద్యార్థికి ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్ . షూస్ స్కూల్ బ్యాగులు ప్రతి ఏడాది పంపిణీ.
“సృజనాత్మకమైన సైన్స్ ల్యాబ్‌లు… ఆధునిక కంప్యూటర్ ల్యాబ్… పాల్ ల్యాబ్ మొదలగు ఆధునిక వనరులతో పిల్లల్లో పరిశోధన, పరిశీలనా శక్తిని పెంపొందించి నేటి పోటీ ప్రపంచానికి ధీటుగా తయారుచేసే విద్యా విధానం…”

ప్రత్యేకంగా స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు నిర్వహించడం ద్వారా విద్యార్థులలో ఆత్మస్థైర్యాన్ని నింపి సునాయాసంగా.. సరళంగా ఇంగ్లీషులో మాట్లాడే నైపుణ్యం పెంపొందించడమే ఈ పాఠశాల ప్రధాన లక్ష్యం.

చదవడంపై ఆసక్తిని పెంపొందిస్తూ జ్ఞానాన్ని విస్తరింప చేయుటకు..
పిల్లలకు అవసరమైన అన్ని రకాల పుస్తకాలతో గ్రంధాలయం కలదు. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలుకూడా అందుబాటులో ఉన్నాయి.

NMMS, IIT, NEET, EAMCET వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణతో మీ పిల్లల కలలను సాకారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము.”

పిల్లల మానసిక ఒత్తిడిని అధికమించేందుకు యోగా, మెడిటేషన్ తరగతులు నిర్వహించబడుతున్నాయి.
మానసిక ఆరోగ్యానికి , శారీరిక దృఢత్వానికి పునాది క్రీడలు.
ఇందుకోసం సువిశాల క్రీడా ప్రాంగణం. విద్యార్థులకు అవసరమైన ఆట వస్తువులు… కలిగి వున్నాయి.

“విద్య మాత్రమే కాదు…వ్యక్తిత్వ వికాసం కూడా మా లక్ష్యం.
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, నాయకత్వ లక్షణాలు పెంపొందించుటకు
స్కౌట్స్ &, గైడ్స్ మరియు NCC శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
9వ తరగతి నుండి ఇంటర్ వరకు చదివే విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలను పెంపొందించడానికి అనువుగా వృత్తి విద్యా కోర్సులైన ఐటీ మరియు అప్పారెల్ లో శిక్షణ ఇస్తున్నాం.
అన్నింటిని మించి శుభ్రమైన త్రాగు నీరు.. RO ప్లాంట్ సౌకర్యం మరియు
ఇంటర్ వరకు సుచికరమైన , రుచికరమైన ఉచిత మధ్యాహ్న భోజన వసతి కలదు .
వెంకటగిరి మరియు పరిసర ప్రాంతాల విద్యార్థుల కోసం పాఠశాల వేళల్లో సురక్షితమైన స్కూల్ బస్ సౌకర్యం కలదు.
మరో విషయం….
ఈ ఏడాది నుంచి 9వ తరగతి నుండి ఇంటర్ దాకా గర్ల్స్ హాస్టల్ సదుపాయం కూడా కలదు.

పాఠశాలను గుణాత్మకంగా బలోపేతం చేయటం, జాతీయ విద్యా విధానాలతో ఆధునిక, మౌలిక సదుపాయాలతో ఆదర్శవంతమైన పాఠశాలగా తీర్చిదిద్దటం, నాణ్యమైన విద్యను అందిచడం పి ఎం శ్రీ మోడల్ స్కూల్ ప్రధాన లక్ష్యం.
మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఆదర్శ పాఠశాల మార్గదర్శకంగా నిలుస్తుంది.

వెంకటగిరి , పరిసర ప్రాంతాల ప్రజలకు ఇదొక అవకాశం .
ఎపి మోడల్ స్కూలులో ఇప్పుడు 6వ తరగతి ప్రవేశాలకు ప్రక్రియ ఆరంభమైంది.
ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక.
100 పరిమిత సీట్లు – ఈ అవకాశాన్ని వదులుకోకండి.”
గుర్తింపు పొందిన ప్రాధమిక పాఠశాలలో తెలుగు లేదా ఇంగ్లిష్ మీడియంలో 5వతరగతి చదువుతున్న విద్యార్థులకు సువర్ణావకాశం.

ఎలా దరకాస్తు చేసుకోవాలని ఆలోచిస్తున్నారా?
అతి సులభం. మీ పరిసర ప్రాంతాల్లోని నెట్ సెంటర్స్ కు లేదా మీ సేవకు వెళ్ళండి. WWW. apms.apcfss.in అనే వెబ్ సైటు ద్వారా మార్చి 31వ తేది లోగా ఆన్ లైన్లో ప్రవేశ రుసుము చెల్లించి ఆన్ లైన్ లో దరకాస్తు చేసుకోండి.
ప్రవేశ పరీక్ష వెంకటగిరి మోడల్ స్కూల్లో ఏప్రిల్ 12వ తేది ఆదివారం ఉదయం జరుగుతుంది .
ఫలితాలను, తుది ఎంపిక జాబితాను ఏప్రిల్ 27వతేది పాఠశాలలో ప్రకటించబడును.

ఇంకా సందేహాలున్నాయా?..
అయితే.. ఏపి మోడల్ స్కూలు పనివేళల్లో సంప్రదించండి.
అత్యవసరమైతే
83330 66000 ఫోన్
నంబరును సంప్రదించండి.

ఇంకెందుకు ఆలస్యం!
వెంటనే దరకాస్తు చేసుకోండి.
ఆగండి .. మరో మాట..
మీ పిల్లలు పదో తరగతి చదివారా?
అయితే మోడల్ స్కూల్ నందు ఇంటర్మీడియట్ లో చేర్పించండి.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి దరకాస్తులు కోరబడుతున్నాయి.
MPC, Bi.P.C, MEC, CEC కోర్సులు కలిగి వున్నాయి. ప్రతి గ్రూపు 40 సీట్లుకు పరిమితం.
సౌకర్యాలు మాత్రం అపరిమితం
మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు
మొదటి అడుగు వేయండి.
ఎపి మోడల్ స్కూలులో ప్రవేశం పొందండి.
అదే పిల్లల విద్యా జీవితానికి మలుపు.
ఆ మలుపుకు ఇదే మా పిలుపు.

✌️
ఆఖరిగా ఒక్క మాట..
ఆదర్శవంతమైన ఈ ఆదర్శపాఠశాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు, పిల్లలకు, ప్రజలకు చేరవేయడానికి
www.apmsvenkatagiri.com పేరుతో వెబ్ సైట్ కలదు.


అలాగే apmsvenkatagiri పేరుతో
యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ట్విట్టర్,
ఇంస్టాగ్రామ్ మొదలైన సాంఘిక మాద్యమాలున్నాయి.

వీటి నిర్వహణే ….
ఈ పాఠశాల గూర్చి కొసమెరుపు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *