Special

ఉత్తమ ఫలితాలే ‘మోడల్ స్కూల్’ లక్ష్యం

ఆదర్శ పాఠశాలలో విద్యనభ్యసించుటకు పలు సదుపాయాలున్నాయి. ఇక్కడ ఎలాంటి ఫీజులు వసూలుచేయబడవు. ప్రవేటు పాఠశాలకు మించి, మిగతా పాఠశాలకు దీటుగా ప్రతిభావంతులైన, పి.హెచ్.డి., ఎం.ఫీల్., నెట్ & స్లేట్లలో ఉన్నత విద్యార్హత కలిగిన ఉత్తమ ఉపాధ్యాయులచే పిల్లలకు గుణాత్మకమైన విద్యను గ్రామీణ విద్యార్ధులకు అందిస్తున్నాం.

మోడల్ స్కూల్ లో ఆంగ్ల బోధనతో పాటు అనేక పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ, స్కాలర్ షిప్పుకు అవకాశం, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత యూనిఫామ్ దుస్తులు, డిజిటల్ క్లాసులు, స్పెషల్ క్లాసులు, అత్యాధునిక సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ క్లాసులు, లైబ్రరీ, ప్లే గ్రౌండ్, మధ్యాహ్న భోజనం పథకం, ఆరో ప్లాంట్ వాటర్ వంటి ప్రత్యేక మౌలిక సదుపాయాలు ఉన్నాయని విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాం. పిల్లలపై మానసిక ఒత్తిడి పడకుండా విజ్ఞానదాయకంగా, వినోదాత్మకంగా సహపాఠ్య చర్యలు కో-కరికులర్ యాక్టివిటీస్, స్కౌట్, గైడు, ఎన్ సి సి, ఆటలు, ప్రత్యేక సందర్భాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇవన్ని పిల్లల్లో దాగివున్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి దోహద పడుతున్నాయి. ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు ప్రత్యేక బోధన సిబ్బందితో వృత్తి విద్య కోర్సులు కూడా నిర్వహిస్తున్నామని తెలుపుతున్నాం. ఇక్కడ ప్రశాంత వాతావరణంలో కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఆధునిక వసతులతో నూరు శాతం ఉత్తమ ఫలితాలను సాధించేలా విలువలతో కూడిన ఉన్నత విద్యను 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా అందించడమే ఆదర్శ పాఠశాల ప్రధాన లక్ష్యం. గత పదేళ్లుగా పలు ప్రతిభా అవార్డులతో ఉత్తమ ఫలితాలను సాధించిన ఘనత వెంకటగిరి ఆదర్శ పాఠశాలకు ఉందని చెపుతున్నాం. వెంకటగిరి పరిసర గ్రామీణ ప్రాంతవాసులు ఇక్కడి విద్యా సదుపాయాలను వినియోగించుకోవాలని కోరుతున్నాం.

  • డి. తులసి జ్యోతి,
    ప్రిన్సిపాల్, ఎ. పి. మోడల్ స్కూల్, వెంకటగిరి
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *