General

12వ తేదీ 6వ తరగతి ప్రవేశార్హత పరీక్ష

12న మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశార్హత పరీక్ష

tulasi jyothi

వెంకటగిరి లోని ఏపీ మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశానికి ఈ నెల 12వ తేదీ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మరియు చీఫ్ సూపరింటెండెంట్ డి . తులసి జ్యోతి తెలిపారు.
శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ ఈ అర్హత పరీక్షకు 227మంది విద్యార్థులు హాజరవుతున్నారని, ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటలవరకు పరీక్ష జరుగుతుందని ఆమె తెలిపారు. అర్హత పరీక్షకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులు ముందురోజే హాల్ టికెట్టు డౌన్లోడ్ చేసుకోవాలని, 12న ఆదివారం ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రానికి హాజరుకావాలని, హాల్ టికెట్‌పై ఫోటో స్పష్టంగా లేని వారు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో పాటు పరీక్షకు కావాల్సిన పెన్నులు, ప్యాడ్ తెచ్చుకోవాలని తెలిపారు. పరీక్ష నిమిత్తం పాఠశాలలో తగు ఏర్పాట్లు గైకొంటున్నట్టు తులసి జ్యోతి తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *