12వ తేదీ 6వ తరగతి ప్రవేశార్హత పరీక్ష
12న మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశార్హత పరీక్ష

వెంకటగిరి లోని ఏపీ మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశానికి ఈ నెల 12వ తేదీ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మరియు చీఫ్ సూపరింటెండెంట్ డి . తులసి జ్యోతి తెలిపారు.
శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ ఈ అర్హత పరీక్షకు 227మంది విద్యార్థులు హాజరవుతున్నారని, ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటలవరకు పరీక్ష జరుగుతుందని ఆమె తెలిపారు. అర్హత పరీక్షకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులు ముందురోజే హాల్ టికెట్టు డౌన్లోడ్ చేసుకోవాలని, 12న ఆదివారం ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రానికి హాజరుకావాలని, హాల్ టికెట్‌పై ఫోటో స్పష్టంగా లేని వారు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో పాటు పరీక్షకు కావాల్సిన పెన్నులు, ప్యాడ్ తెచ్చుకోవాలని తెలిపారు. పరీక్ష నిమిత్తం పాఠశాలలో తగు ఏర్పాట్లు గైకొంటున్నట్టు తులసి జ్యోతి తెలిపారు.
