FeaturedInspirationLatest News

తులసి జ్యోతికి అంతర్జాతీయ గుర్తింపుతో డాక్టరేట్

ఎపి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్
తులసి జ్యోతికి గౌరవ డాక్టరేట్

 తిరుపతి జిల్లా  వెంకటగిరిలో ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న డి. తులసి జ్యోతికి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రసిద్ధ యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ అమెరికా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ లభించింది. విద్యా శాఖలో  జిల్లా, రాష్ట్ర  స్థాయి నుండి  జాతీయ స్థాయి దాకా  అందించిన ఉత్తమ సేవలను గుర్తించి విద్యాశాఖ ధ్రువీకరణ మరియు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆల్ ఇండియా సిఫారసు  మేరకు ఈ గౌరవ డాక్టరేట్ (డి.లిట్) పురస్కారం అందుకొన్నారు. జాతీయ స్థాయిలో ఈ ఏడాది ఈ పురస్కారం నలుగురికే  వరించింది. అందులో తులసి జ్యోతి ఒకరు. 
   ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గౌరవ డాక్టరేట్  పురస్కారాన్ని  తులసి జ్యోతి అందుకోవడానికి వరల్డ్ ఎడ్యుకేషన్ అసెంబ్లీ ప్రాయోజిత పరచింది.  అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అత్యున్నత డిగ్రీ  ఎపి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న డి. తులసి జ్యోతికి  వరించటం  వెంకటగిరికే కాకుండా   ఉభయ తెలుగు రాష్ట్రాలలో గౌరవ ప్రతిష్ఠలు తీసుకొచ్చినట్లయింది
Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288
Oplus_16908288
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *