Events

వెంకటగిరి మోడల్ స్కూలులో రంగ్లా పంజాబ్

రంగ్లా పంజాబ్


పంజాబీ భాష & సాంస్కృతిక ఉత్సవాన్ని వెంకటగిరి, ఎపి మోడల్ స్కూల్ నందు ఈ నెలాఖరున వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
పంజాబీ భాష, పరాక్రమం & సంస్కృతి, సంప్రదాయాలు , అక్కడి కార్యకలాపాలపై ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది.
పంజాబీ వర్ణమాల ప్రదర్శన (గుర్ముఖీ లిపి )
సాధారణ పంజాబీ పదాలు & పదబంధాల మూల
పంజాబీ కవిత్వ పఠనం (బుల్లే షా, జానపద పద్యాలు)
పంజాబీలో కథలు చెప్పడం (ఇంగ్లీష్/తెలుగు వివరణతో)
పంజాబీ సామెతలు & వాటి అర్థాలు
గుర్ముఖీ అక్షరాల చేతివ్రాత / కాలిగ్రఫీ
పంజాబీ భాష, సాహిత్యం & చరిత్రపై క్విజ్
నినాద రచన: “పంజాబీ భాషా – మేరీ పెహ్చాన్”
సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా ఈవెంట్ నిలుస్తుంది.


భంగ్రా నృత్యం, గిద్దా నృత్యం, పంజాబీ జానపద గీతాలు ,పంజాబీ గ్రామ జీవితాన్ని వర్ణించే రూపకాలు, పంజాబీ విలువలపై (పరాక్రమం, ఐక్యత, క్రుస్గి ఇతివృత్తాలతో రూపకాలు, మౌన ప్రదర్శనలు, పంజాబీ సాంప్రదాయ వస్త్రధారణలో ఫ్యాషన్ వాక్, సాంప్రదాయ ప్రదర్శన
పంజాబీ పండుగల ప్రదర్శన (లోహ్రీ, బైసాఖీ, గుర్పురబ్) గోధుమ కంకులు, తలపాగాలు, దుపట్టాలు -వేషధారణలు, సిక్ఖు గురువులు & పంజాబ్ చరిత్ర గురించి వివిధ ప్రదర్శనలుంటాయి.
ఆహారం & వంటకాలు పంజాబీ సంస్కృతిని చూపించే విధంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది.
విద్యార్థులు, తల్లిదండ్రులు విచ్చేసి జయప్రదం చేయాలని పాటశాల యాజమాన్యం కోరుతుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *