వెంకటగిరి మోడల్ స్కూల్లో ఉత్తమ ఫలితాలు.
వెంకటగిరి మోడల్ స్కూల్లో ఉత్తమ ఫలితాలు.
📖
2025-26 విద్యా సంవత్సరం
10వ తరగతి పరీక్షా ఫలితాల్లో వెంకటగిరి,
ఏపి మోడల్ స్కూల్ 96 శాతం ఉత్తీర్ణత సాధించింది.
టి. ముని జస్విత, కె. ముని పూజిత, టి. దక్షిణ్య కిరణ్ బాలికలు మరియు టి. రాజా అనే బాలుడు 600 మార్కులకు గాను 585 మార్కులు సాధించారు.
టి. తేజ 584 మార్కులు, షేక్ సుహైల్ బాలురు 583 మార్కులు సాధించారు.
550 మార్కులకు పైబడి 29 మంది, 500 మార్కులకు పై బడి 48 మంది ఉత్తమ ఫలితాలు సాధించారు.
గురువారం మోడల్ స్కూల్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ డి. తులసి జ్యోతి, ఉపాధ్యాయులు అభినందించారు.

వెంకటగిరి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు,
ఉపాధ్యాయులు మరియు ప్రిన్సిపాల్ డి. తులసి జ్యోతి గారికి
ఈ అద్భుతమైన విజయానికి అభినందనలు —
96% ఉత్తీర్ణత సాధించడం నిజంగా ప్రశంసనీయం!
విద్యార్థులకు ఉజ్వలమైన, విజయవంతమైన భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నాము.