వేసవి సెలవులు
వేసవి సెలవులు
2025-26 విద్యా సంవత్సరం దాదాపు ముగింపు దశకు చేరుకుంది. రెండు రోజుల్లో పాఠశాలలకు వేసవి సెలవులు రానున్నాయి. ఏపీ మోడల్ స్కూల్ లో ప్రస్తుతం 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్ధులందరికీ ప్రస్తుతం సమ్మెటివ్ ఎసెస్మెంట్ 2 పరీక్షలు జరుగుతున్నాయి. ఇక ఏప్రిల్ 23వ తేదీని చివరి పని దినంగా ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించింది. దీంతో ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు రానున్నాయి. అనంతరం 2026-27 విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి మొదలవుతుంది.
ఇప్పటికే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిశాయి. ఇంటర్ ఫలితాలు ఇటీవలే విద్యాశాఖ వెల్లడించింది.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు ఏప్రిల్ 23 నుండి సెకండ్ ఇయర్ లో అడుగుపెడతారు. ఆ రోజు మాత్రం ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు కొనసాగుతాయి. అనంతరం ఏప్రిల్ 24 నుంచి ఇంటర్ విద్యార్ధులకు కూడా వేసవి సెలవులు ఇస్తారు.
అయితే జూన్ 1వ తేదీ నుంచే వీరికి కొత్త విద్యాసంవత్సరం తిరిగి ప్రారంభమవుతుంది. జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ తరగతులు ఇక్కడ మొదలవుతాయి.
వెంకటగిరి ఏ.పీ. మోడల్ స్కూల్స్ లో జోనల్ 4 స్థాయిలో నిర్వహిస్తున్న ఐఐటి, జేఈఈ ఈఏపీ సెట్ కోచింగ్ ఏప్రిల్ 30 వ తేదీ వరకు కోనసాగుతుందని తెలిపారు.
ఈ శిక్షణ ద్వారా విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు దోహదపడుతుందని తెలిపారు ఇందు కోసం మార్గదర్శకత్వం, వ్యూహాలు, పాఠ్య సహాయం ఎంతో అందిస్తున్నామని తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తు, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ కోచింగ్ కార్యక్రమాన్ని ఎపి ప్రభుత్వం ప్రయోజనకరంగా నిర్వహిస్తుందని, ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి తాహెరా సుల్తానా గారు ఈ కార్యక్రమాన్ని ఒక లక్ష్యంగాఅత్యంత శ్రద్ద శక్తులతో, ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని ప్రిన్సిపాల్ తులసి జ్యోతి తెలిపారు. ఏ ఎం ఓ కె. కృష్ణవేణి గారు సహకరిస్తున్నారని తెలిపారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు మంచి రాంకులు తెచ్చుకోవాలని కోరారు.
ఇక వేసవి సెలవు రోజుల్లో విద్యార్ధుల దినచర్యపై దృష్టి పెట్టి ఎపి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డా. తులసి జ్యోతి విద్యార్థులకు సూచనలు చేశారు. . సముద్రం, నదులు, సరస్సులు, చెరువులు, కుంటల వద్దకు విద్యార్థులు స్నానానికి వెళ్లనివ్వవద్దని ఆమె తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
వేసవి తాపం ఎక్కువగా ఉన్నందున, బయట ఆడుకునే సమయంలో విద్యార్థులు ఎక్కువగా నీళ్లు తాగేలా చూడాలని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సెలవుల్లో విద్యార్థులు ఒంటరితనానికి గురికాకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆడుకోవడం, కలిసి భోజనం చేయడం వంటి సామాజిక కార్యక్రమాల ద్వారా వారిని ఉత్సాహంగా ఉంచాలని వివరించారు. టీవీలు, సెల్ఫోన్ల ముందు ఎక్కువ సమయం గడపకుండా వారిని నియంత్రించాలని సూచించారు.
