7, 8 మరియు 9వ తరగతిలో ప్రవేశానికి…
వెంకటగిరి
ఏపి మోడల్ స్కూల్
7,8,9వ తరగతుల ప్రవేశ పరీక్ష
📖
2026-27 విద్యా సంవత్సరానికి వెంకటగిరిలోని ఏపీ మోడల్ స్కూలులో 7, 8 మరియు 9వ తరగతిలో ప్రవేశానికి వేసవి సెలవులు తరువాత పాఠశాల పునః ప్రారంభమైన మొదటి వారంలో ప్రవేశ పరీక్ష నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎంపిక చేసుకొంటామని ప్రిన్సిపాల్ డి. తులసి జ్యోతి తెలిపారు.
పాఠశాల విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు ఈ పాఠశాలలో 7,8,9వ తరగతుల్లో వచ్చే విద్యా సంవత్సరంలోని ఖాళీ సీట్లను భర్తీ చేయడానికి ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని, ఎవరికీ నేరుగా సీటు కేటాయించే అవకాశం లేదని తెలిపారు.
ఆయా తరగతుల ప్రవేశానికి
అర్హత కలిగిన విద్యార్థినీ విద్యార్థులు పాఠశాలలో గానీ ఆన్లైన్లో గానీ ప్రవేశ రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ప్రవేశ పరీక్ష ఫలితాలను అర్హత పరీక్ష అనంతరం ప్రకటిస్తామని, ఆ తరువాతే అడ్మిషన్స్ స్వీకరిస్తామని ఆమె తెలిపారు.
ఇతర వివరాలకు పాఠశాల పనివేళల్లో సంప్రదించాలని తులసి జ్యోతి తెలిపారు.
