Academics

మోడల్ స్కూల్‌లో ఐఐటి, జేఈఈ

వెంకటగిరి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ తులసి జ్యోతి

ఎపి జోన్-4 పరిధిలోని ఏ.పీ. మోడల్ స్కూల్స్‌కు చెందిన ప్రతిభావంతులైన విద్యార్ధుల కోసం వెంకటగిరిలోని ఎపి మోడల్ స్కూల్ నందు జోనల్ స్థాయిలో ఐఐటి,జేఈఈ ఈఏపీ సెట్ కోచింగ్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి జరుగుతుంది. ఏప్రిల్ 30వ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఈ విషయమై ఎపి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డా.డి.తులసి జ్యోతి మరిన్ని వివరాలు తెలిపారు.

coching2
 ఈ కోచింగ్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా  ఏప్రిల్ 30 వరకు నిర్వహించబడుతుందని ఆమె తెలిపారు. ఈ శిక్షణ  కొరకు  ఆన్‌లైన్ మరియు ఆఫ్ లైన్  స్క్రీనింగ్ టెస్ట్   ద్వారా విద్యార్థులను ఎంపిక చేసుకొని  ఈ శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో, జోన్ 4 పరిధిలో  ఎంపికయిన  మొత్తం 100 మంది బాలురకు ఈ ప్రత్యేక శిక్షణ అందించబడుతుందని ఆమె తెలిపారు. 
       ఈ కార్యక్రమంలో ఐ ఐ టి/ జేఈఈ ఎం సెట్ శిక్షణలో            అనుభవజ్ఞులైన అధ్యాపకులచే  విద్యార్థులకు నాణ్యమైన కోచింగ్ అందించడంతో పాటు, అభ్యాస పాఠ్యపుస్తకాలు (స్టడీ మెటీరియల్), రోజువారీ పరీక్షలు మరియు వారాంత పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా  ఈ కోచింగ్ కార్యక్రమం రెసిడెన్షియల్ విధానంలో నిర్వహించబడుతూ, విద్యార్థులకు పోషకాహారంతో కూడిన ఆహారం అందించబడుతుందని  ఆమె వివరించారు. 
    ఈ శిక్షణ ద్వారా విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కావలసిన మార్గదర్శకత్వం, వ్యూహాలు, పాఠ్య సహాయం ఎంతో అందిస్తున్నామని  తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ కోచింగ్ కార్యక్రమాన్ని  ఎపి ప్రభుత్వం  ప్రయోజనకరంగా నిర్వహిస్తుందని,   ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి తాహెరా సుల్తానా గారు , ఏ ఎం ఓ కె. కృష్ణవేణి గారు ఈ  కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారని ప్రిన్సిపాల్ తులసి జ్యోతి తెలిపారు
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *