Latest News

ఎన్ ఎం ఎం ఎస్ కు 10 మంది

ఎన్ ఎం ఎం ఎస్ కు మోడల్ స్కూల్ విద్యార్థులు 10 మంది ఎంపిక

            విద్యా రంగంలో మరో విశిష్ట విజయాన్ని నమోదు చేస్తూ 2025–26 విద్యా సంవత్సరానికి  నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్  (NMMS)  నిర్వహించిన పరీక్షలో వెంకటగిరి,  ఏపీ మోడల్ స్కూల్ 10 మంది విద్యార్థినీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి  ఆర్ధిక సహాయం  పొందడానికి ఎంపికయ్యారు.
   ఈ సందర్భంగా స్కాలర్‌షిప్‌కు ఎంపికైన  విద్యార్థులు 

మల్లెల హితీషా షార్లీ రాజ్, చినకొండ వినూత్న రెడ్డి, జీ.బి. జ్యోష్ణ
ఏ. హవిషా, మామిడి జయంత్ కుమార్, చింతల సుజిత్ కుమార్, ఏనమల భావన్, పొట్ట ముని వర్షిత, పొలూరు ధనుప్రియ, ఎస్. శివ కార్తిక అర్హత సాధించిన వారిలో వున్నారు.
ఈ విజయంలో విద్యార్థుల కృషితో పాటు, పరీక్షల్లో అర్హత సాధించడానికి, మార్గ దర్శకత్వం వహించిన ఉపాధ్యాయుల పాత్ర చాలా గొప్పదని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డి. తులసి జ్యోతి కొనియాడారు.
గురువారం పాఠశాల్లో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో టి.జి.టి మ్యాథ్స్ శ్రీమతి ఐ. వినీలా, టి.జి.టి సైన్స్ శ్రీమతి కళావాణి, టి.జి.టి సోషల్ శ్రీ వి. శ్రీకాంత్, పి.జి.టి ఫిజిక్స్ శ్రీమతి కె. విజయలక్ష్మి, పి.జి.టి కెమిస్ట్రీ శ్రీ ఈ. కిషోర్, అలాగే పి.జి.టి కామర్స్ ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. సమగ్రంగా శిక్షణ ఇచ్చి, నిరంతర పర్యవేక్షణతో ఉత్తమ ఫలితాలను సాధించేందుకు తోడ్పడ్డారని తులసి జ్యోతి చెప్పారు.
విద్యారులు ఉపాధ్యాయుల సహకారంతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ విజయం పాఠశాల విద్యా ప్రమాణాలకు నిదర్శనంగా నిలుస్తూ, జిల్లా స్థాయిలో పాఠశాలకు మరింత గౌరవాన్ని తెచ్చిందని, విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారం కలిసి ఈ విజయానికి మూలస్తంభాలుగా నిలిచాయని అన్నారు.
ఆర్ధికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందించే ఈ పథకానికి నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) పొందడానికి దేశ వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలలో ఉత్తీర్ణులై ఈ అర్హత సాధించటం అభినందనీయమని అన్నారు. ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు నెలకు 1000 రూ. చొప్పున ఏడాదికి రూ. 12,000 అందిస్తారు. 4 ఏళ్ల పాటు ఈ ఆర్ధిక సహాయం నాలుగేళ్ల పాటు అందుతోందని చెప్పారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *