AdministrationFeatured

మోడల్ స్కూల్ లో 7,8,9 తరగతులసీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

మోడల్ స్కూల్ లో 7,8,9 తరగతుల
సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

         వెంకటగిరిలో ఏపీ మోడల్  స్కూల్ నందు 2026-27 విద్యా సంవత్సరానికి 7,8,9 తరగతులలో మూడు  సీట్లు వంతున  ఖాళీలు ఏర్పడ్డాయని, ఈ సీట్లను భర్తీ చేయడానికి ఈ నెల 24వ తేది అర్హత పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ డి. తులసి జ్యోతి ప్రకటించారు.   
          బుధవారం  విలేఖరులతో  మాట్లాడుతూ  7,8,9 తరగతుల సీట్లను  భర్తీ చేయడానికి https://apms.apcfss.in/   అధికారిక వెబ్ సైటు నుండి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. ఈ నెల 20వ తేదీ లోగా  తప్పని సరిగా అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు  చేసుకోవాలని, జూన్ 24వ తేది బుధవారం  ఉదయం 10 గంటలకు  స్థానిక మోడల్ స్కూలులో జరిగే  అర్హత పరీక్షలకు హాజరు కావాలని ఆమె తెలిపారు. మరుసటి రోజు  ఫలితాలు ప్రకటిస్తామన్నారు.
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *